తెలంగాణ

కట్టుదిట్టమైన బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం దృష్టి సారించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకోగా, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని బస్ డీపోలు, బస్టాండ్ల వద్ద కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేసి, మహిళా పోలీసులను కూడా డ్యూటీలో ఉంచాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం అదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి కోర్టుకు పంపాలని సీఎం రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
అత్యవసర సమావేశం..
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శాఖా పరంగా చేపట్టాల్సిన, అనుసరించాల్సి వ్యుహాలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమవేశంలో సీనియర్ అధికారులతో పాటు, శాంతి భద్రతలకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును ముమ్మరం చేయాలని సంబంధిత జిల్లా ఏస్పీలు, కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా లేక ఉద్యమం పేరిట విధ్వంసం సృష్టించినా కఠినంగా వ్యవహరించాలని వారికి స్పష్టం చేశారు.