తెలంగాణ

యూరియా అక్రమ పంపిణీపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో యూరియా అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతులు ఇబ్బంది పడొద్దని నిత్యం మానిటర్ చేస్తున్నామన్నారు. పాయింట్ ఆఫ్ సేల్ (పాస్) ద్వారా ఆన్‌లైన్ విధానంలో యూరియా అమ్మకాలు జరపాలని ఆదేశించినప్పటికీ, అక్రమాలు జరిగాయంటూ వచ్చిన వార్తల పట్ల విచారం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏ కేంద్రాలపై ఆరోపణలు వచ్చాయో విచారణ చేయాలంటూ విజిలెన్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్టు విచారణలో తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల పట్ల బాధ్యత లేనితనాన్ని సహించబోమన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం తాను సహించబోనని మంత్రి అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు, ఉద్దేశాలకు విఘాతం కలిగించేవారిని సహించబోమని స్పష్టం చేశారు.