తెలంగాణ

సంతలో పశువుల్లా.. కాంగ్రెస్ వారిని కొంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, అక్టోబర్ 9: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ వారు కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను పశువుల సంతలో కొనుగోలు చేసినట్లు డబ్బు సంచులు దించి కొనుగోలు చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి దుయ్యబట్టారు. హుజూర్‌నగర్‌లోని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీపీలను, సర్పచ్‌లను, జడ్పీటీసీలను, కాంగ్రెస్ కార్యకర్తలను పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర బృందం కొనుగోలు చేయటడే ఒక పనిగా పెట్టుకుని వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమ్మెను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిస్తే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఓడిపోతామని గ్రహించే నగదు, మద్యం, అధికార అహంకారంతో వ్యవహిరిస్తున్నారని అయినా హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009 నుండి చేసిన అభివృద్ధిని మరువరని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని 30 వేల మెజార్టీతో గెలిపిస్తారని రవి అన్నారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

*చిత్రం... హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి