తెలంగాణ

నేటినుంచి యువజనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 3: ఖమ్మం జిల్లా భద్రాచలం వేదికగా తలపెట్టిన రాష్టస్థ్రాయి యువజనోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజధాని వెలుపల జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి 950 మంది యువ కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో గిరిజన సంప్రదాయ నృత్యం కొమ్ముకోయ, కూచిపూడి తదితర కళారూపాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ జనరల్ మేనేజర్ కె.వేణుగోపాలరావు తెలిపారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల నడుమ ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 5, 6 తేదీల్లో 18 అంశాలతో కూడిన పోటీలను నిర్వహిస్తున్నారు. 6వ తేదీ సాయంత్రం గోదావరి కరకట్ట వద్ద ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. 10 జిల్లాల నుంచి వచ్చే యువ కళాకారుల కోసం విడివిడిగా 9 ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు. పోటీదారులకు భద్రాచలంలో తిరగడానికి ఉచిత ప్రయాణ వసతి, మూడు రోజుల పాటు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.

వైఎస్ అభిమానులకు
అండగా ఉంటా: షర్మిల
గజ్వేల్, జనవరి 3: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిని జీర్ణించుకోలేక మృతి చెందిన మనె్న జయమ్మ కుటుంబ సభ్యులను వర్గల్ మండలం అంబర్‌పేటలో ఆదివారం తెలంగాణ వైకాపా ఇన్‌చార్జి షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శ్రమిస్తుండగా దివంగత వైఎస్సార్ చేపట్టిన పథకాలు వైకాపాను అధికారంలోకి తేవడంతోనే సాధ్యపడుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైకాపా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.