తెలంగాణ

భద్రాచలం సరిహద్దుల్లో మావోల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 29: ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో మావోయిస్టులు ఆదివారం కలకలం రేపారు. ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లోని ఎటపాక- భద్రాచలం పోలీసుస్టేషన్ల సమీపంలో పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ శబరి ఏరియా కమిటీ పేరుతో వాల్‌పోస్టర్లను వదిలారు. యువత మావోయిస్టు పార్టీలో చేరాలని, ఆదివాసీ, దళిత, మైనార్టీ, మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో హిందూ మతోన్మాదం అంతకంతకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మావోయిస్టుల పేరుతో లూటీ
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టుల పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ 30 జాతీయ రహదారిపై కుంట వద్ద స్వైరవిహారం చేశారు. హైదరాబాద్-జగ్దల్‌పూర్ బస్సును కుంటకు 6కి.మీ దూరంలోని ఆసిల్‌గూడ వద్ద అటకాయించి ప్రయాణికుల నుంచి రూ.70 వేల నగదు, బంగారం, ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇక్కడే మరో బస్సు, లారీలను సైతం అటకాయించి డబ్బులు దోచుకున్నారు. మావోయిస్టుల పేరు చెప్పి దుండగులు ఈ దురాగతానికి పాల్పడటం విశేషం. నెల రోజుల క్రితం తోంగుపాల్ వద్ద ఇదే తరహాలో బస్సును అటకాయించి బాలుడి వైద్యం కోసం వెళ్తున్న కుటుంబీకుల నుంచి రూ.35వేలను దోచుకున్న ఘటన మరువక ముందే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

మావోయిస్టులు వదిలిన వాల్‌పోస్టర్లు