తెలంగాణ

మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, తాడ్వాయి, సెప్టెంబర్ 23: సమ్మక్క సారలమ్మ దీవెనలతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ఆమె మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి సమ్మక్క సారలమ్మకు బతుకమ్మ చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేడారం రావడంతో ఎస్పీ సంగ్రామ్‌సింగ్, కలెక్టర్ నారాయణరెడ్డి, మేడారం పూజారులు, వివిధ శాఖల అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నేరుగా సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్దకు వెళ్లి చీరలను సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమక్క, సారలమ్మ జాతరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. గిరిజన బిడ్డగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మహబూబాబాద్, ములుగు ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉంటారని, వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా 2020 ఫిబ్రవరిలో జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు జాతీయ హోదా ఇచ్చేలా కేంద్రంతో పోరాడుతామని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దేశంలో మేడారం జాతరను గుర్తింపు పొందేలా చూస్తామన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీతారాంనాయక్, ప్రస్తుత ఎంపి మాలోతు కవితలు కూడా జాతర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. గత జాతర కన్నా ఈ జాతరకు భక్తులు పెరిగే అవకాశం ఉందని అందుకు తగిన విధంగా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించేలా చూస్తామన్నారు. అనంతరం మంత్రి గద్దెల చుట్టూ మొక్కలు నాటారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగజ్యోతి, ఈవోపీఆర్డీ చక్రధర్‌రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ మంత్రి చందులాల్, ఎంపీపీ వాణీశ్రీ, సర్పంచ్ బాబురావు ఈవో రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, సారయ్య, కిరణ్, బాబురావు, గోపాల్‌రావు, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.