తెలంగాణ

కాంగ్రెస్ జోలికొస్తే వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, సెప్టెంబర్ 23 : హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ సైనికులంతా సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో సోమవారం రాత్రి జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అరాచకం సృష్టిస్తోందని ఈ విషయంలో చావడానికైనా సిద్ధం.. ఆత్మరక్షణ కోసం చంపడానికైనా సిద్ధమని ఆయన అన్నారు. కార్యకర్తల మరోధైర్యానికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. టీఆర్‌ఎస్‌కు దిక్కులేక ఆంధ్ర వ్యక్తి సైదిరెడ్డిని నిలబెట్టారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించగానే అధికార దుర్వినియోగం మొదలైందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి రైతుబంధు డబ్బులు బ్యాంకుల్లో జమ అవుతున్నాయన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేసుకుందన్నారు. పార్టీ కార్యకర్తలందరూ టీఆర్ ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు, మద్యం తీసుకోండి ఓటుమాత్రం కాంగ్రెస్‌కు వేయాలని ఆయన కోరారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ హుజుర్‌నగర్ నియోజకర్గంలో వచ్చే నెల ఉప ఎన్నిక జరిగే 21వ తేదీలోపు అమలుచేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు పింఛను 3016, దళితులకు మూడెకరాలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇలా అన్నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ వారు ఓటుకోసం వచ్చినప్పుడు మీకు ఎందుకెయ్యాలని ప్రశ్నించాలన్నారు. ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో కాంగ్రస్ పార్టీని అధికమెజార్టీతో గెలిపించి అధికారపార్టీకి తగినవిధంగా బుద్ధి చెప్పాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం వెంటనే ప్రారంభించాలని పార్టీ విజయంకోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లురవి, బ్లాక్ కాంగ్రస్ అధ్యక్షుడు పయిడిమర్రి రంగనాథ్, మండల పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, సుందరి నాగేశ్వరరావు, మూలగుండ్ల సీతారాంరెడ్డి, సైదిరెడ్డి, మాజీ జడ్‌పీటీసీ మట్టయ్య, చాంద్‌పాషా, జుట్టుకొండ సత్యనారాయణ, కందుల కోటిరెడ్డి, బండా నర్సిరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

*చిత్రం...గరిడేపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్