తెలంగాణ

నేతన్నలకు భరోసా..ఆడపడుచులకు గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: స్వరాష్ట్రంలో తెలంగాణ అడపడుచుల గౌరవం సంతోషాల కోసం, నేతన్నలకు బతుకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు తోబుట్టువు మాదిరిగా బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ పథకం అమలు చేస్తున్నారని, తెలంగాణలో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పారిశ్రామిక, చేనేత, జౌళి శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో భూదాన్‌పోచంపల్లిలో చేనేత కార్మికుల దుర్భర పరిస్థితులకు, ఆత్మహత్యలకు చలించిన సీఎం కేసీఆర్ ఆనాడు జోలెపట్టి బలవన్మరణాలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 వేల చొప్పున ఆర్థ్ధిక సహాయం అందించారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఉద్యమకాలంలో చేనేత కార్మికులు పడిన బాధలు స్వరాష్ట్రంలో పడకూడదన్న లక్ష్యంతో వారి ఆదాయాన్ని రెట్టింపు చేసి వారికి బతుకుపై భరోసా కల్పించేందుకు బతుకమ్మ చీరల తయారీ పనులను అప్పగించారన్నారు. బతుకమ్మ చీరలతో పాటు స్కూల్ యూనిఫామ్‌ల తయారీ, కేసీఆర్ కిట్‌లో చీరల తయారీ పనులను కూడా నేతన్నలకు అప్పగించామని, భవిష్యత్‌లో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల యూనిఫామ్‌లను కూడా అప్పగించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చేనేత కార్మికుల ఆదాయం ఎనిమిది వేల నుంచి 20 వేల వరకు పెరిగిందన్నారు. 50 శాతం సబ్సిడీతో నేతన్నలకు నూలు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణయేనని అన్నారు. చేనేత వస్త్రాల కొనుగోలుకు చేనేత లక్ష్మీ, కార్మికులు పొదుపు చేసే మొత్తంకు రెట్టింపు సొమ్ము అందించే త్రిఫ్ట్ పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, కొత్త టెక్స్‌టైల్స్ పార్కులు, అపెరల్ పార్కులు, వీవర్ పార్కులు నెలకొల్పుతున్నామని, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు రాబోతుందన్నారు. దేశంలోనే చేనేతల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాల ధారణ దినంగా ప్రభుత్వం పాటిస్తుందన్నారు. రాజకీయ పోరాటాలు ఎన్నికల సమయంలోనే చూసుకోవాలని, రానున్న నాలుగేళ్లు ఎన్నికలు లేనందున ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులే లక్ష్యంగా పనిచేస్తూ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించనుందన్నారు. విపక్షాలు సైతం రాజకీయాలకు అతీతంగా రాష్ట్భ్రావృద్ధిలో కలిసినడవాలన్నారు. నల్లగొండ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుండి ప్రత్యేకమైన ప్రేమ ఉందని అందుకే సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరిలలో మెడికల్ కళాశాలలు, ఎయిమ్స్ ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటికి పక్కా భవనాలతో పాటు అన్ని వసతుల కల్పనకు వందల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. యాదాద్రి ఆలయాన్ని వందలకోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మింపచేస్తున్నారని తద్వారా 13 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దండుమల్కాపురంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. నల్లగొండ ఉదయ సముద్రం చెరువు ట్యాంక్‌బండ్‌గా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరిక మేరకు 35 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణానదిలో ఈ ఏడాది సమృద్ధిగా వరదలు సాగి నాగార్జునసాగర్ నిండగా రైతులకు కాలువల ద్వారా సాగునీరందుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ రీతిలో రైతన్నలకు రైతుబంధు, రైతురుణమాఫీ, రైతుబీమా పథకాలు అమలు చేస్తుండగా వారి ఆత్మహత్యలు తగ్గాయని, చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలతో వారి ఆత్మహత్యలు తగ్గాయని ఇక రైతు, నేతన్నల ఆత్మహత్యలు ఉండబోవన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నారని, వారి సంతోషం కోసం వంద డిజైన్లతో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టామన్నారు. మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమనాయకుడిగా ప్రజల బాగోగులు తెలిసిన కేసీఆర్ చేనేతల కడుపునింపేందుకు, భరోసానిచ్చేందుకు బతుకమ్మ చీరల పంపిణీ పథకం తెచ్చారన్నారు. మంత్రి కేటీఆర్ చర్యలతో చేనేతకు పూర్వవైభవం వచ్చిందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేతన్నలకు ఆర్థిక చేయూతను, ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందించడం ఆనందంగా ఉందన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడం, సీఎంగా ఉద్యమనేత కేసీఆర్ కావడంతోనే రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకోగలుగుతున్నామన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉండి దీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరక్టర్ శైలజరామయ్యర్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆర్.రవీంద్రకుమార్, ఎన్.్భస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...నల్లగొండలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్