తెలంగాణ

మెట్రో ఘటనపై సర్కార్ సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పై కప్పు పెచ్చులూడి మహిళ మృతి చెందిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. స్వతంత్ర ఇంజనీరంగ్ నిపుణులతో ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మెట్రోరైలు అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు. అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలన్నారు. ప్రయాణికుల భద్రతకు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అమీర్‌పేట స్టేషన్ వద్ద జరిగిన ఘటన అనుకోని ప్రమాదమే అయినప్పటికీ ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాణ్యతా, భద్రతా అంశాలలో హైదరాబాద్ రైలు సాధించిన ఖ్యాతిని కాపాడుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వౌనిక మృతి పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా మెట్రోరైలు పై కప్పు పెచ్చులూడి మృత్యవాత పడిన వౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ మేరకు మృతురాలి బంధువులతో ఒప్పందం కుదిరినట్టు కూడా ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రోరైలు అధికారులతో మృతురాలి కుటుంబ సభ్యుల తరఫున తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ నాయకుడు సుధాకర్ సమావేశమయ్యారు. వౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, రూ. 15 లక్షల బీమా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఎల్ అండ్ టి యాజమాన్యం అంగీకరించినట్టు సుధాకర్ మీడియాకు తెలిపారు. చర్చలకు ముందు కేవలం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లిస్తామని ఎల్ అండ్ టీ అధికారులు స్పష్టం చేయగా మృతురాలి తరఫున చర్చలు జరిపిన కోదండరామ్, సుధాకర్‌లు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు 20 లక్షలు చెల్లించడానికి ఎల్ అండ్ టీ అంగీకరించింది. ఇలా ఉండగా మృతురాలు వౌనిక భర్త చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలితే సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. వౌనిక మృతదేహానికి సోమవారం గాంధీ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు.
*చిత్రం...గాంధీ ఆస్పత్రి వద్ద రోదిస్తున్న వౌనిక బంధువులు