తెలంగాణ

ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2019-20 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం నాడు పౌరసరఫరాల భవన్‌లో రాష్ట్రంలోని మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కమిషనర్ అకున్ సబర్వాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో 40.41 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో కలిపి 77 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించి, దేశంలో రెండోస్థానంలో నిలిచామన్నారు. భవిష్యత్తులో వరిధాన్యం సేకరణలో మొదటిస్థానం పొందే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా, రైతుబంధు
పేరుతో పెట్టుబడికి ఎకరాకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తుండటం వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. ధాన్యం ఉత్పాదకలో కూడా గణనీయంగా పెరుగుదల సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిలను రూపొందిస్తున్నారని, దాంతో వరిధాన్యం దిగుబడిలో ఉన్నతస్థానం చేరే అవకాశాలున్నాయన్నారు. రైస్‌మిల్లర్లు ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి సహకరించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. మిల్లర్లపై తమకు ఎలాంటి దురద్దేశం లేదని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదవిద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం మిల్లర్ల నుండి ఏడాదికి 1.20 లక్షల టన్నుల సన్నబియ్యం సేకరిస్తున్నామని గుర్తు చేశారు. 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు 12 కోట్ల గన్నీ సంచులు అవసరమని అకున్ సబర్వాల్ తెలిపారు. మిల్లర్ల వద్ద ఉన్న గన్నీ సంచులను వెంటనే పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలని కోరారు.
*చిత్రం...మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతున్న సంస్థ చైర్మన్ శ్రీనివాస రెడ్డి