తెలంగాణ

రోగులకు మంచి వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో విషజ్వరాలతో ఆసుపత్రులకు చేరుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున ప్రభుత్వం ప్రత్యక్ష చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసుపత్రుల పనితీరుపై పర్యవేక్షిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని మంత్రి ఈటల పరిశీలించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లతో ఆయన ముఖాముఖ చర్చలు జరిపారు. దాదాపు 7 గంటల పాటు ఆసుపత్రిలో వివిధ విభాగాలపై మంత్రి డాక్టర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. గాంధీ ఆసుపత్రి అంటేనే పేదల ఆసుపత్రిగా పేరు వచ్చిందన్నారు. పేద రోగులకు మంచి వైద్యం అందిస్తే వారు చిరకాలం వైద్యులను గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్లకు సూచించారు. రోగులు ప్రమాద పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఉస్మానియా ఆసుపత్రికి వస్తారని, ఆ సమయంలో రోగుల బంధువులు ఆందోళనతో ఉంటారని, ఆ సమయంలో వైద్యులు సంయమనంతో వైద్య సహాయం చేయలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మంత్రి దృష్టికి వారికి ఎదురవుతున్న సమస్యలను ఏకరుపెట్టారు. డాక్టర్లపై మూకుమ్మడిగా దాడులు చేయడానికి రోగుల బంధువులు ప్రయత్నాలు చేయడంతో డాక్టర్లు మానసికంగా ఆందోళన చెందుతున్నారని మంత్రికి వారు సూచించారు. భవిషత్‌లో దాడులు
జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆసుపత్రుల్లో వైద్య పరికరాలతోపాటు వైద్యులు, నర్సుల కొరత లేకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 7వ వేతనం ప్రకారం జీతాలు పెంచాలని అడిగిన ప్రశ్నలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. పెరిగిన రోగులను దృష్టిలో పెట్టుకుని యూనిట్స్ పెంచాలని హెచ్‌వోడీలు మంత్రికి సూచించారు. ప్రతి ఆసుపత్రిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ డాక్టర్స్‌కి ప్రతినెలా స్టయిఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం జాప్యం కాకుండా డీఎంఈకి మంత్రి సూచించారు. ప్రభుత్వపరంగా వైద్యులకు అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని, అయితే ఆసుపత్రికి వచ్చే రోగుల మంచి వైద్యం, చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్