తెలంగాణ

నేడే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ఉమ్మడి రాజధానిలోని రాజకీయవర్గాలే గాక, సామాన్య ప్రజలు సైతం ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం జారీ అయ్యే అవకాశాలున్నాయి. మధ్యాహ్నమే 150 ఎన్నికల డివిజన్ల రిజర్వేషన్లను, సాయంత్రం అయిదు గంటల్లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం అధికార పార్టీతో సహా విపక్షాలు కాంగ్రెస్, బిజెపి కూడా ఎన్నికల ఏర్పాట్ల సమావేశాలను నిర్వహించాయి. టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సైతం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ హడావిడినిబట్టి చూస్తే సోమవారమే నోటిఫికేషన్ వెలువడటానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల సమాచారం టిఆర్‌ఎస్ పార్టీకి అందిందనీ, తమకు ఇవ్వలేదని, రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలకు కనీసం 45 రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు కోర్టులో పిటిషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నాయి.