తెలంగాణ

రైతులారా..రూ. లక్ష మీఖాతాల్లో వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో లక్షరూపాయ వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
శాసనసభలో ఆదివారం ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ, 2018 డిసెంబర్ 11 వరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాల్లో లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామన్నారు. ఈ హామీని అమలు చేయడం ప్రారంభించామన్నారు. 2019-20 వార్షిక బడ్జెట్‌లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. మూడునాలుగు దశల్లో రుణమాఫీ పూర్తవుతుందన్నారు. రైతులు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నిధులను దశలవారీగా విడుదల చేస్తామన్నారు. ఈ వాస్తవాలను గమనించి రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించాలని, తిరిగి రుణాలు పొందాలని సూచించారు. రైతులు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించినప్పటికీ, ఆ మేరకు ప్రభుత్వం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం డబ్బు చెల్లించదేమోనని ఎట్టిపరిస్థితిలోనూ అనుమానపడవద్దని విజ్ఞప్తి చేశారు. రుణాలను రైతులు తిరిగి చెల్లిస్తే మళ్లీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు సాంకేతికంగా ఇబ్బందులు రావని వివరించారు. ఇలా ఉండగా కౌలు రైతులను తమ ప్రభుత్వం గుర్తించదని కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు కౌలురైతులకు వర్తించవని తెలిపారు. ఈ విషయంలో రెండో ఆలోచన ఏదీ లేదని వివరించారు.