తెలంగాణ

75 గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతి అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: 75 గజాల లోపు ఇళ్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వ అనుమతి అవసరం లేదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 75 గజాల నుండి 600 గజాలలోపు ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు అన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. అన్‌లైన్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం కేవలం 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ శాసనమండలిలో మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. రానున్న నూతన చట్టంపై తీసుకువస్తున్న పలు విషయాలు ఆయన వెల్లడించారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు సంతానం కంటే ఎక్కువ ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని మంత్రి తెలిపారు. మున్సిపల్ కొత్త చట్టం చాలా కఠినంగా ఉంటుందని, చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసిన కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లపై ప్రతి మూడు నెలలకొకసారి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కమిటీ పర్యవేక్షించనున్నదని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ పద్ధతిని కూడా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చర్చలో భాగంగా పురపాలక సంస్థలపై కలెక్టర్ల పెత్తనమేంటి అంటూ కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులకు ఎగ్జిక్యూటివ్ పవర్ లేదని మంత్రి తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ రాంచందర్ రావుకూడా జీవన్ రెడ్డి అభిప్రాయంతో ఏకీభవించారు. కొత్త మున్సిపల్ చట్టంలో మొత్తం ఐదు సవరణలు చేసినట్టు కేటీఆర్ తెలిపారు.
కొత్త చట్టాల వల్ల అధికారులను నియంత్రించేందుకు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే ఆవకాశం ప్రభుత్వానికి కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎలక్ట్రానిక్ ఆఫీస్ ‘ఈ ఆఫీస్ వ్యవస్థను ప్రారంభిస్తున్నామని, తద్వారా అధికారుల పనితీరు ఎలా ఉందో పసిగట్టేందుకు వీలుకలుగుతుందన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని చట్టసభల నుంచే అమలు చేయాలని దీనికి సభాపతితో పాటు సభ్యులు మద్దతు తెలపాలని సూచించారు.