తెలంగాణ

యురేనియం తవ్వకాలపై కేటీఆర్ తీర్మానానికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: యురేనియం తవ్వకాలపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సభ్యులు ఆమోదించారు. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికకు సంబంధించిన విషయాలను మంత్రి సభలో వివరించారు. రాష్ట్ర జీఎస్‌బీపీతో పోల్చితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఖర్చులు తగ్గుతాయని కాగ్ వెల్లడించినట్లు మంత్రి తెలిపారు. 2016-17లో పెరిగిన క్యాపిటల్ వ్యయం 2017-18లో తగ్గినట్లు కాగ్ నివేదిక ఇచ్చిందని, ప్రాథమిక లోటు తగ్గినా ఖర్చులను తీర్చే స్థాయిలో అప్పులే కాని, రాబడి లేదని కాగ్ వెల్లడించినట్లు మంత్రి వివరించారు. గత బడ్జెట్ అంచనాలతో పోల్చితే రెవెన్యూ రాబడి రూ.24.259 కోట్లు తగ్గిందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి వ్యయం, క్యాపిటల్ వ్యయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ, విద్యా రంగంలో మాత్రం వెనుకబడి ఉందని తేల్చింది. సాగు నీటి ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.70.758 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ నివేదికలో పేర్కొందని మంత్రి వివరించారు. ఆదివారం మంత్రి కేటీఅర్ ప్రవేశపెట్టిన పురపాలక బిల్లు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.