తెలంగాణ

ప్రమాదంలో ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ప్రమాదంలో పడుతుందనే సంకేతాలు వస్తున్నాయని, విద్యుత్ రంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లనే మేలు జరిగిందని, టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో ప్రస్తుతం చెల్లిస్తున్న అప్పుల్లో అసలు, వడ్డీ కలిపి రూ. 50 వేల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్నారు. ప్రణాళిక సరిగా లేవన్నారు. ఈ తరహా ఆర్థిక విధానాలను అవలంభిస్తే బంగారు తెలంగాణ కాకుండా సంపూర్ణ అప్పుల తెలంగాణగా అవతరిస్తుందని అన్నారు. ప్రస్తుతం రూ.23840 కోట్లను రుణాల నిమిత్తం చెల్లిస్తున్నామన్నారు. సాలీనా 8 శాతం చొప్పున ఈ రుణ భారం పెరుగుతుందన్నారు. రెవెన్యూ వసూళ్లు రూ.1.11 కోట్లు వస్తుందని అంచనా వేశారని, మొత్తం ఖర్చు, నికర రెవెన్యూ విలువ మధ్య చూస్తే లోటు ఎక్కువగా కనపడుతుందన్నారు. 2023 నాటికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనే భయం కలుగుతోందన్నారు. మొత్తం అప్పులు రూ.3 లక్షల కోట్లకు దాటుతున్నాయన్నారు. రుణమాఫీ , రైతు బంధు పథకాలను అటకెక్కిస్తున్నారన్నారు. ఉస్మానియా వర్శిటీ విద్యార్థులకు సరిగా మెస్ చార్జీలు చెల్లించడం లేదని, ఫెలోషిప్‌లు ఇవ్వడం లేదన్నారు. ఇంటర్
బోర్డు విద్యార్థినులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. గ్లోబరీనాపై, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని, ప్రజారంజకమైన మైన విధానాలను అమలు చేస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేక విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయన్నారు. కేంద్రం ఆజమాయిషీ పెరిగిందన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వసతి సదుపాయాలు మెరుగయ్యాయని, కేసీఆర్ కిట్స్‌కు మంచి స్పందన లభిస్తోందన్నారు.

*చిత్రం...సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క