తెలంగాణ

ప్రాంతీయ పార్టీలు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ప్రాంతీయ పార్టీల వల్లే రాష్ట్రాలు సర్వోతోముఖాభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన బదులిస్తూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీర్మానం చేసుకుని రాజ్యాంగ బద్ధంగా టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడివిడిగా తమ పార్టీలో చేరలేదన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తామని విలీనమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనకు తానుగా చేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా విధ్వంసపాత్ర పోషించిందన్నారు. గోవాలో పది మంది కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ విలీనం చేసుకుందన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆరుగురున్న బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో విలీనం చేసుకుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభకు చెందిన నలుగురు ప్రాంతీయ పార్టీ ఎంపీలను ఉపరాష్టప్రతి, పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి సమక్షంలో బీజేపీలో చేర్చుకుందన్నారు. సమైక్య రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఉంటే, అప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై తాను కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నానని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిరాయింపు అని ఎలా మాట్లాడుతున్నారని అడిగారు. ప్రతి రాష్ట్రానికో రాజ్యాంగం ఉంటుందా అన్నారుర. అబద్థాలు చెప్పే కర్మ తమకు పట్టలేదన్నారు.
ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క లేచి కేసీఆర్ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పటకప్పుడు
స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చామన్నారు. కేసీఆర్ ఘాటుగా బదులిస్తూ గాలిలో పిటిషన్లు ఇచ్చారా అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటై తీర్మానం చేసుకుని టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ అంశంపైన అవగాహన లేకుండా మాట్లాడడం అలవాటన్నారు. ప్రతిపక్షపార్టీ నేతలకు ఏ అంశంపై ఎలా మాట్లాడాలో తెలియదన్నారు.
తాను ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారితో తప్ప మరెవరితో మాట్లాడలేదని, చివరకు వ్యక్తిగత సిబ్బందితో కూడా అంటీముట్టనట్లు ఉన్నానని, ప్రగతిభవన్‌లో కార్యాలయం వైపు కూడా రాలేదన్నారు. అధికారులను నమ్ముకుంటే, మాట్లాడితే ఓట్లు వస్తాయా అని అన్నారు. పక్కరాష్ట్రంలో ఎన్నికల సమయంలో స్కీంలు ప్రవేశపెట్టి దెబ్బతిన్నారన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని 2014 ఎన్నికల్లో కూడా చెప్పారని, కాని ప్రజలు తమ పాలనకు మెచ్చి వరుసగా రెండుసార్లు పెద్ద మెజారిటీతో సీట్లు ఇచ్చారన్నారు.

*చిత్రం...ముఖ్యమంత్రి కేసీఆర్