తెలంగాణ

50 టీఎంసీలకు చేరువగా ఎస్సారెస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 21: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. స్థానికంగానే కాకుండా ఎగువన మహారాష్టల్రోనూ గడిచిన రెండుమూడు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద జలాలు పెద్దఎత్తున వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి వడివడిగా చేరువవుతోంది. శనివారం సాయంత్రం నాటికి ఎగువ ప్రాంతాల నుండి 58వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, ఇన్‌ఫ్లో ఇదేవిధంగా కొనసాగితే సెప్టెంబర్ నెలాఖరులోపే ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకునే అవకాశాలు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఎస్సారెస్పీ విషయంలో మరోమారు సెప్టెంబర్ సెంటిమెంటు ఫలించినట్లవుతుంది. భారీగా వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోలతో ప్రతీ మూడు గంటలకు ఒక టీఎంసీ వరకు నీటి నిల్వలు పెరుగుతుండడం ఈ అంచనాలకు ఆస్కారం కల్పిస్తోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, అమ్దురా, బలేగాం, బాబ్లీ ప్రాజెక్టుల మిగులు జలాలు తోడవడంతో ఎస్సారెస్పీలోకి 58వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 1091.00అడుగులు, 90టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో, శనివారం సాయంత్రం నాటికి 1077.90అడుగులు, 47.10టీఎంసీలకు నీటిమట్టం చేరుకుంది. శుక్రవారం సాయంత్రం వరకు కూడా 1074.80 అడుగులు, 39.238 టీఎంసీల వద్దే నీరు నిలిచి ఉండగా, 24గంటల వ్యవధిలోనే దాదాపు ఎనిమిది టీఎంసీల వరకు వరద జలాలు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరాయి. మరో 36గంటల పాటు ఇదే తరహాలో ఇన్‌ఫ్లోలు కొనసాగే అవకాశాలుండడం వల్ల ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1084.50అడుగులు, 65.294టీఎంసీల వద్ద నిల్వ ఉందని ఏ.ఈ మహేందర్ తెలిపారు.

*చిత్రం...వడివడిగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతున్న శ్రీరాంసాగర్ రిజర్వాయర్