తెలంగాణ

మళ్లీ తెరపైకి వర్గాల కుంపట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21: మళ్లీ తెరపైకి కాంగ్రెస్ గ్రూప్ కుంపట్లు వచ్చేశాయి. గ్రూపులకు నిలయంగా మారిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆ కారణంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ల మధ్య వార్ మొదలైంది. రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నేతగా ఉన్నారు. అయితే ఈయనకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తనకంటూ ఓ వర్గం ఉంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ నేతలను, ముఖ్యమంత్రితో సహ అందరిని సందర్భం వచ్చినప్పుడల్లా తుప్పారా పడుతున్నారు. దాంతో రేవంత్‌రెడ్డి క్రేజ్ కాంగ్రెస్ పార్టీలో ఓ స్థాయికి ఎదిగిపోయింది. ఆయనను కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో బడా నేతగా భావిస్తున్నారు. ఇదే తరహలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ రాజకీయ ఒనమాలు కాంగ్రెస్ నుండి కావడంతో ఆయనకు కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫాలొయింగ్ ఉంది. ఈ ఇద్దరిని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు యువనేతలుగా భావిస్తున్నారు. సంపత్‌కుమార్ ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయనకు రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సినియర్ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇవన్ని ఎలా ఉనప్పటికిని రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు. ఈ నేపథ్యంలోనే నల్లమల అటవీ ప్రాంతంలో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశం ఈ ఇద్దరి నేతల మధ్య బేదాభిప్రాయాలను సృష్టించింది. వీరిద్దరితో పాటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి కూడా ఈ గ్రూపుల్లో చిక్కుకున్నారు. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశం జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య గ్రూపుల కుంపట్లు తెరపైకి తీసుకువచ్చింది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దగ్గర ఫోటోలకు అవకాశం దక్కలేదని యూరేనియంపై ఏబిసిడిలు కూడా సంపత్‌కు తెలియదని రేవంత్‌రెడ్డి అనడం అదేవిధంగా సంపత్‌కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి కూడా ఆ సమావేశం గురించి రేవంత్‌పై విమర్శలు గుప్పించడంతో వీరిమధ్య ఉన్నటువంటి బేధాభిప్రాయాలు భగ్గుమన్నాయి. ఇటివల రేవంత్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సోనియాగాంధీని కలువగా రెండుమూడు రోజులకే సంపత్‌కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీని కలువడంతో అప్పటి నుండే ఈ ముగ్గురి నేతల మధ్య గ్రూపులు బయటపడ్డట్లు వెల్లడైంది. అయితే ఇటివల జరిగిన పరిణామాలపై రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్‌పై, వంశీచంద్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వంశీచంద్‌రెడ్డి మాత్రం స్పందించలేదు. కాగా సంపత్‌కుమార్ మాత్రం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు స్పందించారు.
ఇలా రేవంత్, సంపత్‌ల మధ్య మాటల వేడి ప్రారంభం కావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపుల కుంపట్లు తెరపైకి వచ్చాయి. ఈ కారణంగా నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు డైలమాలో పడ్డారు. ఈ ఇద్దరు యువనేతలు పరస్పరంగా మాటల తూటాలు పెల్చుకోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో మరో కుంపటి మొదలైందని కొందరు కాంగ్రెస్ సినియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి, సంపత్‌ల మధ్య నెలకొన్న వార్ ఎటువైపు దారి తీస్తుందోననే చర్చ మాత్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపందుకుంది.
*చిత్రాలు.. ఎంపీ రేవంత్ రెడ్డి
*ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్