తెలంగాణ

రాష్ట్ర అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల సంఘం కార్యవర్గం పిలుపు ఇచ్చింది. ఎర్రమంజిల్‌లో గురువారం కే. లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై కార్యవర్గం చర్చించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు బలోపేతం అవుతున్నాయని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారం లో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు మాజీలు కూడా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు. గ్రామజ్యోతి, హరితహారం, 30 రోజుల ప్రణాళిక, కాళేశ్వరంతో సహా నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయని కితాబిచ్చారు. రైతుబంధు, వ్యవసాయ రుణాల మాఫీ తదితర పథకాలు పంటల ఉత్పత్తులను పెంచేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రోతాహకాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరుల్లో ఆత్మస్థైర్యం నిండిందని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, రాజేశంగౌడ్, సుద్దాల దేవ య్య, మాజీ ఎమ్మెల్సీ సుధాకరరెడ్డి, కొమిరెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు.