తెలంగాణ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్షన్.. టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 19: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోల చర్యలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈనెల 21 నుండి నవంబర్ 8 వరకు మావోయిస్టు ఆవిర్భావోత్సవాలు ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం వేడెక్కింది. గురువారం ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల కరపత్రాలు దర్శనమివ్వడం కలకలం రేపాయి. వాజేడు మండలంలోని గణపురం 163 జాతీయ రహదారిపై దర్శనం ఇచ్చిన ఈ కరపత్రాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మావోయిస్టు టార్గెట్లను అలర్టు చేశారు. రాజకీయ నాయకులకు, టార్గెట్లకు భద్రత పెంచారు. వీఐపీల పర్యటనపై నిఘా పెంచారు. ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఒక వైపు మావోల చర్యలు, మరోవైపు పోలీసుల చర్యలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లాలో రోడ్లపై దర్శనమిచ్చిన కరపత్రాలతో మరింత వేడి పెరిగింది. భారతదేశంలో నిజమైన విప్లవ కార్మిక వర్గ పార్టీ మావోయిస్టేనని, 15వ అవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని ఆ కరపత్రంలో పిలుపునిచ్చారు. వాడవాడల్లో, బస్తీలలో, గ్రామాల్లో, పట్టణాల్లో సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించుకొని విప్లవ స్ఫూర్తితో ముందుకు పోవాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ముందస్తు ఎన్నికల పేరుతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాలతో కార్పొరేట్ సంస్థలకు సామ్రాజ్య వాదులకు ఊడిగం చేస్తూ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను (చట్టాలను) కాలరాస్తున్నారన్నారు. రైతుల, ఆదివాసీల పోడు భూములను ఫారెస్టు అధికారులు పోలీసులతో దాడులు చేసి ఆదివాసుల, రైతులను భూముల నుండి గెంటివేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ రైతాంగం తిరగబడి ప్రతిఘటిస్తే పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేసి పీడీ యాక్టు కేసులు బనాయిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపి బలోపేతం కావడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జమ్ము కాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టీకల్ 370 రద్దు చేసి కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాసిందని ఆ కరపత్రంలో పేర్కొన్నారు.