తెలంగాణ

శాంతి బృందం కిడ్నాప్, విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 3: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నాలుగు రోజుల క్రితం ముగ్గురు పూణె విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సుక్మా జిల్లా బాసగూడ ప్రాంతంలో వీరిని మావోయిస్టులు అపహరించినట్లుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు గుర్తించారు. దీంతో దక్షిణ బస్తర్‌లో కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఎస్పీలకు బస్తర్ ఐజీ కల్లూరి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎట్టకేలకు మావోయిస్టులు అపహరించిన ముగ్గురు పూణె విద్యార్ధులు ఆదర్శ్‌పాటిల్, విలాస్‌వలాకే, శ్రీకృష్ణసేవాలేలను ఆదివారం చింతలనార్ అటవీప్రాంతంలో విడుదల చేశారు. వారిని సిఆర్‌పిఎఫ్ 201 కోబ్రా బలగాలు సురక్షితంగా తరలించాయి. ఐజీ కల్లూరి, సుక్మా ఎస్పీ దాస్‌లు వీరిని ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా సుక్మా జిల్లా కేంద్రానికి తరలించారు. దీంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. మహారాష్టల్రోని పూణెకు చెందిన ఈ విద్యార్ధుల బృందం ప్రపంచ శాంతి కోరుతూ సైకిల్ యాత్రను చేపట్టింది. ఇందులోభాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ యాత్రను నిర్వహించాలని సంకల్పించింది. గత నెల 20వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. బైరంగఢ్, దంతెవాడ మీదుగా సుక్మా జిల్లాలోకి ఇటీవలే ప్రవేశించారు. సుక్మా తర్వాత శబరి మీదుగా దాటి ఒడిశాలోని కలహండి, మల్కన్‌గిరి జిల్లాలో వీరు సైకిల్ యాత్ర నిర్వహించాల్సి ఉంది. ఇంతలో సుక్మా జిల్లా బాసగూడ వద్ద వీరిని నాలుగు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొందరు మావోయిస్టులతో చర్చలు కూడా జరిగాయి. వారి ప్రాణాలకు హాని తలపెట్ట వద్దని అన్ని వర్గాల వారు వేడుకున్నారు. వీరికి తోడు ఛత్తీస్‌గఢ్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు కూడా నిలిపివేయడంతో వీరి విడుదలకు మార్గం సుగమమైంది.
మావోయిస్టుల చెర నుండి బయటపడిన విద్యార్థులు