తెలంగాణ

పాజిటివ్ ఎనర్జీకి యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: శారీరక దృఢత్వం కోసమే కాకుండా మనలో పాజిటివ్ ఎనర్జీని ప్రవేశపెట్టేందుకు ‘యోగా’ ఉపయోగపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లోని సాంస్కృతిక భవన్‌లో రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకోసం గురువారం ఆమె యోగా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ‘్ఫట్ ఇండియా’ పిలుపుపై ప్రజలంతా స్పందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా ‘్ఫట్’గా ఉండాలని పిలుపు ఇచ్చారు. తాను రోజూ యోగా చేస్తుంటానని తెలిపారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగేకొద్దీ ప్రజలు శారీరక శ్రమ, ఎక్సర్‌సైజ్‌పై శ్రద్ద తీసుకోవడం లేదన్నారు. యోగాతో పాటు ఉదయం నడక వల్ల శరీరానికి శక్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సలహాదారు ఎపీవీఎన్ శర్మ, గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, రాజ్‌భవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...యోగాభ్యాసం చేస్తున్న గవర్నర్ తమిళిసై