తెలంగాణ

మరింత పటిష్టంగా వ్యవసాయ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో మరింత పటిష్టంగా వ్యవసాయశాఖను రూపుదిద్దుతామని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయశాఖను పటిష్టపరచడానికి, సాగుకు పనికి వచ్చే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించిందని, వ్యవసాయ అధికారులకు ఆగ్రానమిస్టులుగా నైపుణ్యం పెంచడానికి శిక్షణ ఇచ్చారని అన్నారు. ఇంటర్‌నెట్ సౌకర్యంతో పాటు ట్యాబ్‌లను కూడా సమకూర్చామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రెండు వేల 162 మంది వ్యవసాయ విస్తరణాధికారులను, 114 మంది వ్యవసాయ అధికారులను నియమించిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేశామని ఆయన సభకు వివరించారు. గండ్ర వెంకటరమణ, జాజుల సురేందర్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను జమ్మికుంట, సిద్దిపేట జిల్లా తోర్నాల, రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్, కామారెడ్డి జిల్లా మాల్ తుమ్మెద గ్రామాల్లో ప్రారంభించామని చెప్పారు.