తెలంగాణ

2 నుంచి స్కూళ్లలో ‘స్వచ్ఛ’ పాఠశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్టవ్య్రాప్తంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల్లో స్వచ్చతను సాధించేందుకు విద్యాశాఖ నడుం భిగించింది. ఇందుకు గాను 2వ తేదీ నుంచి మహాత్మగాంధీ జయంతి రోజు నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్వచ్ఛ పాఠశాల’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ కార్యదిర్శ డా.బీ.జనార్దన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని కూకట్‌పల్లి జేఎన్‌టీయులో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శి డా.బీ. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 29వేల ప్రభుత్వం పాఠశాలలు, పదివేల పై చిలుకు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లోస్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వీరందరిలో స్వచ్ఛ స్పూర్తిని నింపేందుకు ఈ ఈ కార్యక్రమాన్ని 2వ తేదీ నుంచి ముమ్మరంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో దాదాపు 50దేశాల్లో పాఠశాల స్థాయి విద్యార్థులకు డయేరియా, వైరల్ జ్వరాలు, నిమోనియా ఇతర సీజనల్ వ్యాధులే రావని, దీనకి ప్రధాన కారణం వ్యక్తిగత పరిశుభ్రతపై పాఠశాల స్థాయి నుంచే చైతన్యం కల్గించటమని వివరించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి పాఠశాలకు 39 అంశాలను పంపించామని, వీటి ఆధారంగా ప్రతి పాఠశాల స్వీయ మూల్యాంకనం ద్వారా స్వచ్ఛతపై రేటింగ్ పొందాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినీపై రూ. 50వేలు, రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థిపై రూ.లక్షకు పై చిలుకు ప్రభుత్వం వెచ్చిస్తోందని, ప్రభుత్వం పాఠశాలలో ప్రతిరోజు దాదాపు 20శాతం పై చిలుకు విద్యార్థులు గైర్హాజరవుతున్నారని వివరించారు. పాఠశాలల్లో హాజరుశాతాన్ని పెంచటం, స్వచ్ఛతపై విద్యార్థుల్లో అవగాహనను పెంచి, వారిని స్వచ్ఛ దూతలుగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ-ఆఫీసు
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో ఈ-ఆఫీసును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీ.కే.శ్రీదేవి వెల్లడించారు. ఈఆఫీసు ద్వారా దాదాపు రెండున్నర లక్షల ఫైళ్ల నిర్వహణ చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో లక్షల ఫైళ్లకు సంబంధించిన పేపర్‌ను ఆదా చేయవచ్చునని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పురపాల సంఘాల్లో ఆస్తిపన్ను చెల్లించే బకాయిదారులకు నోటీసులను కూడా ఈ-ఆఫీసు ద్వారా పంపనున్నట్లు ఆమె తెలిపారు.