తెలంగాణ

కేసీఆర్ పథకాలే యూఎన్ లక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర శాసనసభ బుధవారం ఎనిమిది పద్దులకు ఆమోదం తెలిపింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు రిలీఫ్, ఆబ్కారీ, మద్య నిషేధం, రవాణా, వాణిజ్యపన్నులు, హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, పౌరసరఫరాల నిర్వహణల పద్దులను సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల తరహాలోనే 17 లక్ష్యాలను ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ, సహకార రంగాలకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ, ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని 193 దేశాలకు స్పష్టమైన లక్ష్యాలను, కార్యక్రమాలను సూచించిందన్నారు. పేదరికం లేని సమాజం ఏర్పాటు, ఉత్తమ వైద్యం అందించడం, ఆకలి గొన్నవారికి ఆహారం ఇవ్వడం, తాగునీరు అందించడం, ఉపాధి కల్పించడం, మెరుగైన విద్యుత్తు సరఫరా, ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం చేయడం, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం, పారిశుద్ధ్యం బాగా ఉండేలా చూడటం, పంటల ఉత్పత్తులు పెంచడం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం ఏర్పాటు తదితర అంశాలపై ప్రపంచదేశాలు దృష్టి కేంద్రీకరించాలంటూ ఐక్యరాజ్య సమితి 2015 లో లక్ష్యాలుగా పెట్టిందన్నారు. అయితే 2014 లోనే ఈ తరహా లక్ష్యాలను కేసీఆర్ తెలంగాణ కోసం ప్రతిపాదించారన్నారు. కేసీఆర్ దూరదృష్టి ఎంత ఉన్నతమైందో స్పష్టమవుతోందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 50 లక్షల టన్నుల వరిధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని అంచనావేశామని, ఈ మొత్తాన్ని కనీస మద్దతు ధరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పౌరసరఫరాల మంత్రి కమలాకర్ తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి తరఫున మంత్రి వేముల ప్రశాంతరెడ్డి సమాధానం చెబుతూ, పరిపాలన సులువుగా జరిగేందుకు జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య గణనీయంగా పెంచామన్నారు. త్వరలోనే రెవెన్యూ చట్టం కొత్తగా తీసుకువస్తున్నామన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా వస్తున్న ఆదాయం పెరిగిందని చెప్పారు. సీసీఎల్‌ఏగా సీనియర్ అధికారిని త్వరలోనే నియమిస్తామన్నారు. రాష్ట్రాన్ని గుడుంబారహిత రాష్ట్రంగా మారుస్తామని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. మద్యం దుకాణాల సంఖ్య 2003 లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని, వీటి సంఖ్యను పెంచలేదన్నారు. వాణిజ్యపన్నుల వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయని ముఖ్యమంత్రి తరఫున పశుసంవర్ధక మంత్రి తలసాని తెలిపారు. గొర్రెల పెంపకానికి ఎన్‌సీడీసీ ద్వారా 5000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంటున్నామన్నారు. గొర్రెల పంపిణీ రెండో దశను ఈ నెల 25 నుండి ప్రారంభిస్తామని తలసాని ప్రకటించారు. మనుషుల ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్‌లు ఎలా ఉన్నాయో పశువుల కోసం కూడా 100 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారుల ఉపాధికి జలాశయాల్లో చేపపిల్లల పెంపకం కొనసాగిస్తామని వెల్లడించారు. రవాణా శాఖకు సంబంధించి 59 సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని రవాణా శాఖపై జరిగిన చర్చకు సమాధానంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా అన్ని రకాల కార్డులను మొబైల్ ఫోన్లకు పంపిస్తామని తెలిపారు. డ్రైవర్లుగా శిక్షణ పొందాలనుకునే వారికి సిర్సిల్లలో 16 కోట్ల రూపాయలతో ఒక సంస్థను ప్రారంభిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్ వల్ల వాహనదారులపై ఆర్థిక భారం పడుతోందని, అందువల్ల మన రాష్ట్రానికి ఉపయోగపడేలా కొత్త చట్టం తీసుకువస్తామని వెల్లడించారు. ఆర్టీసీ రోజూ 2.50 కోట్ల రూపాయల నష్టానికి గురవుతోందని అజయ్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీలో ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులు 40 నడుస్తున్నాయని, త్వరలో మరో 325 బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. హోంశాఖపై జరిగిన చర్చకు మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమాధానం చెబుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని తెలిపారు.