తెలంగాణ

తెలంగాణ ఏర్పాటు తర్వాత నాలుగు మెడికల్ కాలేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ బుధవారం శాసనసభలో వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండలో నాలుగు కొత్త కాలేజీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సతీష్‌కుమార్ ఒడితెల అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ 2019లో 50 ఎంబీబీఎస్ సీట్లతో బీబీనగర్, ఎయిమ్స్ కూడా ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్, సూపర్‌స్పెషాలిటీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న విషయం వాస్తవమేనని అన్నారు. 2014 తర్వాత 298 కొత్త పీజీ సీట్లు, ఐదు కొత్త సూపర్ స్పెషాలిటీ సీట్లు అదనంగా ఇచ్చారని అన్నారు. 167 ప్రొఫెసర్ పదవులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశామని, 360 అసోసియేట్ ప్రొఫెసర్ పదవులను కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేశామని అన్నారు. 711 అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవులను నేరుగా నియమించామనే, కొన్ని పోస్టులను సరెండర్ల ద్వారా భర్తీ చేశామని తెలిపారు. అలాగే 50 ట్యూటర్ పదవులను నేరుగా నియమించామని, ఫ్యాకల్టీ లోటును అధిగమించడానికి టీచింగ్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచామని అన్నారు. నిర్ధిష్ట కాలపరిమితి పదోన్నతుల కోసం కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.
నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు
రాష్ట్రంలో 37 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని వైద్య మంత్రి ఈటల తెలిపారు. ఎస్ రాజేందర్‌రెడ్డి, ఎం సంజయ్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ 25 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పూర్తి నిర్వహణలో ఉన్నాయని, 10 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, రెండు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. 2019-20 సంవత్సరంలో ఎన్‌హెచ్‌ఎం కింద ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఐదు కొత్త నవజాత శిశు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని అన్నారు. 25 కేంద్రాల్లో 10 పడకల కంగారూ మదర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంతవరకు 1,11,767 శిశువులకు సేవలు అందించామని ఆయన వెల్లడించారు.

*చిత్రం... వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్