తెలంగాణ

వైద్యులు అంకితభావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ 37వ అంతర్జాతీయ కాంగ్రెస్ సొసైటీ బ్లడ్ ఫ్యూరిఫికేషన్ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆధునాతన వైద్యాన్ని రోగులకు అందించాలని కోరారు. వైద్య శాస్త్రంలో నెఫ్రాలజిస్టులు కీలకపాత్రను పోషిస్తున్నారన్నారు. నెఫ్రాలజీలో సాంకేతిక వైద్య మార్పులు త్వరితగతిన చోటు చేసుకుంటున్నాయన్నారు. దేశంలో 1500 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారని చెప్పారు. మన దేశ జనాభా 130 కోట్లని, కనీసం 20వేల నెఫ్రాలజిస్టులు అవసరమన్నారు. ఇటీవల కాలంలో మూత్ర పిండాల వైఫల్యం అనారోగ్య సమస్య తీవ్రమైందన్నారు. ప్రతి పది లక్షల మందిలో 151 నుంచి 232 మంది వరకు కిడ్నీల సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. తగినంత మంది నెఫ్రాలజిస్టులు అందుబాటులో లేనందు వల్ల కిడ్నీ రోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హేమో డయాలసిస్ కంటే తక్కువ ఖర్చుతోనే కిడ్నీ రోగాలను నయం చేసే వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మదుమేహ వ్యాధి వల్ల డయాలసిస్ నిర్వహించడం సవాలుగా మారిందన్నారు. సంక్లిష్టసమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఎక్కువ మంది నెఫ్రాలజిస్టులకు శిక్షణ ఇచ్చేవిధంగా సీనియర్ వైద్య నిపుణులు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రక్తం పరిశుద్ధత అనే ప్రక్రియ వల్ల కిడ్నీ రోగులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఆధునిక వైద్య సేవలు తక్కువ ఖర్చుకే సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన సుప్రసిద్ధ నెఫ్రాలజిస్టులు పాల్గొన్నారు.
*చిత్రం...37వ అంతర్జాతీయ కాంగ్రెస్ సొసైటీ బ్లడ్ ఫ్యూరిఫికేషన్ సదస్సులో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై