తెలంగాణ

పట్టాదార్ పుస్తకాలపై రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో ఏళ్ల తరబడి భూమిని అనుభవిస్తున్న వారి పేరు మీద పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎంట్రీలు చేయకుండా భూములు వదిలివెళ్లిన వారు, గతంలో సాదాబైనమా కింద భూములు ఇచ్చేసిన యాజమానుల పేర్లను నమోదు చేస్తున్నారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల పట్ల అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీఎల్‌పీ నేతకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం పూర్తయిందని స్పీకర్ మైక్‌ను ఆఫ్ చేశారు. ఈ చర్యతో కాంగ్రెస్
సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి తమ సీట్లలోనే లేచి నిలబడ్డారు. అనంతరం టీఆర్‌ఎస్ సభ్యుడి ప్రసంగం పూర్తయిన తర్వాత స్పీకర్ మళ్లీ సీఎల్‌పీ నేత భట్టికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో సభ సద్దు మణిగింది. బుధవారం శాసనసభలో రెవెన్యూ, రవాణా తదితర పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వనపర్తి జిల్లా పాన్‌గల్ పండా మండలంలోని ఒక గ్రామంలో భూమి అనుభవదారులైన రైతుల పేర్లను పట్టాపుస్తకాల్లో ఎంట్రీలు చేయలేదన్నారు. దశాబ్దాల నుంచి ఈ రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. భూమి యాజమాని చిక్కేపల్లి రామకృష్ణదంటూ పాస్ పుస్తకాల్లో ఎంట్రీ చేశారన్నారు. 200 ఎకరాల వరకు భూమిని పేద రైతులు సాగుచేసుకుంటున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లాలోనే ఈ తరహా సంఘటనలు జరిగాయన్నారు. భూమి మీద హక్కును కల్పించాల్సిన ప్రభుత్వం పేద రైతులకు ద్రోహం చేయడం తగదన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ అవసరమైతే తాను భట్టితో కలిసి ఆ గ్రామంలో పర్యటిస్తామని, జనం వెంటబడి ఎవరిని తరుముతారో చూద్దామా? అని సవాల్ విసిరారు. రెవెన్యూ రికార్డు ప్రక్షాళన, కొత్త చట్టాలు తెస్తున్నామని, పట్టాదార్ పుస్తకాల్లో ఎంట్రీల్లో లోపాలు ఉంటే సరిదిద్దుతారని, అంతేకానీ ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ మాట్లాడిన తర్వాత భట్టి విక్రమార్కకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత మాట్లాడుతూ రైతుల బతుకులన్నీ రెవెన్యూ రికార్డుల చుట్టే ఉంటుందని, స్వాతంత్య్రం వచ్చిన పీవీ నరసింహారావు తెచ్చిన భూ సంస్కరణల ఫలితాలు, పేద రైతులకు అందాలని కోరారు. సీసీఎల్‌ఏ అధికారి పోస్టు ఖాళీగా ఉందని, వెంటనే భర్తీ చేయాలన్నారు. మియాపూర్ భూములతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉందన్నారు. 2013 నుంచి రిక్రూట్‌మెంట్ లేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు. మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ మాట్లాడుతూ మద్యం ఏరులై పారుతోందని, ఇష్టం వచ్చినట్లు పర్మిట్లు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని కోరారు.
*చిత్రం... సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క