తెలంగాణ

కల్తీని ఖతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రజలకు కల్తీలేని ఆహారాన్ని అందించేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. శాసనసభలో వివిధ పద్దులపై బుధవారం జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ, ప్రస్తుతం మార్కెట్లో ఏది కొనాలన్నా ‘కల్తీ’ లేకుండా దొరకడం లేదని, చివరకు పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కల్తీలేని ఆహార పంటలు, కూరగాయలను ప్రజలకు అందించాలన్నదే తన ఉద్దేశమన్నారు. కల్తీలేని ఆహార పదార్థాలను అందిస్తున్న ‘విజయ’ పాలు, పాలపదార్థాలపై ప్రజల్లో నమ్మకం ఉందని గుర్తు చేశారు. ఈ తరహాలోనే ఇతర ఆహార పదార్థాలను కూడా ప్రజలకు అందించాల్సి ఉందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నామని, ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల స్థానాలను మూడు నెలల్లో భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాగునీటి సౌకర్యాలు పెరగడం తదితర కారణాల వల్ల పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండుతాయని ఆయన గుర్తు చేశారు. వీటికి మార్కెట్ సౌకర్యాలు కల్పించడం
ప్రధాన సవాల్‌గా ప్రభుత్వం ముందు నిలుస్తుందన్నారు. పప్పులు, నూనె విత్తనాలు, తృణధాన్యాలు, పసుపు, మిరప తదితర పంటలు పండుతున్నప్పటికీ, వీటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఒకవైపు ఉత్పత్తి పెరుగుతుండగా, సేద్యం రంగంలో పరిశోధనా ఫలితాలు రైతులకు అందడం, వ్యవసాయ విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో పంటల ఉత్పాదకత కూడా పెరుగుతుందన్నారు. మార్కెట్లోకి భారీగా పంటల ఉత్పత్తులు వస్తుండటం వల్ల రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కూడా లభించాల్సి ఉందని, మార్కెట్లోకి వస్తున్న పంటలు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాల్సి ఉందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో గతంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న చర్యలతో పంటల ఉత్పత్తులు పెద్దమొత్తంలో మార్కెట్లోకి వచ్చాయని, పంటల కొనుగోలు సరిగా లేకపోవడం, మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళనను ఆపేందుకు పోలీసులు ఫైరింగ్ చేశారని, అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ తరహా అనుభవాలు మనకు కూడా ఎదురుకానున్న నేపథ్యంలో సరైన ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉందని సీఎం నొక్కి చెప్పారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మహిళా సంఘాల సేవలు వాడుకోవాల్సి ఉంటుందని, తద్వారా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రతి గ్రామంలో ప్రాసెసింగ్ పరిశ్రమలు రావడం వల్ల ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు లభిస్తాయన్నారు. ఈ విషయంలో రైతు సమన్వయ సమితిల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు రైతు సమన్వయ సమితులు పనిచేయడం ప్రారంభం కాలేదన్నారు. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను రైతుల వద్దకు తీసుకువెళ్లడం, రైతులకు సహకరించడం, పంటల ఉత్పత్తులు పెంచడంలో సహకారం అందిస్తూనే ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణలో ఈ సమితులు కీలకభూమిక పోషించాల్సి ఉందన్నారు. త్వరలోనే రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తామన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు