తెలంగాణ

56.76 లక్షల మందికి రైతు బంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రైతుబంధు కార్యక్రమం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తోందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, కోనేరు కోనప్ప తదితరులు మంగళవారం శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ 2018-19 సంవత్సరంలో రైతుబంధు పథకం కింద ప్రతి సీజన్‌కూ ఎకరాలకు 4వేలు చొప్పున ఏడాదికి 8వేలు పెట్టుబడికి మద్దతుగా రైతులకు అందజేశామని అన్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఇటీవలె పెంచిందని 2019-20 సంవత్సరానికి గానూ రైతుబంధు పథకం కింద ప్రతి సీజన్‌కూ ఎకరాకు 4వేల రూపాయిల నుండి ఐదు వేల రూపాయిలకు పెంచి , ఏడాదికి 10వేల రూపాయిలు చొప్పున పెట్టుబడికి మద్దతుగా రైతులకు అందజేస్తున్నామని అన్నారు. 2018-19 సంవత్సరానికి గానూ 51.50 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించామని ఆయన వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి గానూ ఖరీఫ్‌సీజనుకు 56.76 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేశామని చెప్పారు. 2018-2019 సంవత్సరానికి ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి 10 వేల 505 కోట్ల రూపాయిలు రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏకీకృత పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం డిసెంబర్ 31 నాటికి అందుబాటులోకి వస్తుందని హోం మంత్రి మహ్మద్ మొహమ్మద్ అలి చెప్పారు. దానం నాగేందర్, మాగంటి గోపీనాధ్, బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి శాసనసభలో సమాధానం చెబుతూ ఈ ఏకీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం వల్ల అనేక లాభాలున్నాయని అన్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసు సేవలను అందించనుందని అన్నారు. ఈ కేంద్రం లక్షకు పైగా సీసీటీవీలు, ట్రాఫిక్ నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానం, నేర నియంత్రణ ప్రక్రియ మొదలైన వాటితో అనుసంథానమై ఉంటుందని అన్నారు. సంఘటన నిర్వహణ వ్యవస్థ కోసం ఒక స్టాప్ హబ్‌గా పనిచేస్తుందని అన్నారు.
అగ్నిమాపక , విపత్తు నిర్వహణ, రెవిన్యూ, జీహెచ్‌ఎంసీ , ఆర్ అండ్ బీ , ఆరోగ్యం వంటి ఇతర శాఖలతో సత్వర సంప్రదింపుల కోసం బహుళ ఏజన్సీ ఆపరేషన్ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. 350 కోట్ల రూపాయిల అంచనా వ్యయంతో దీనిని నిర్మించారని అన్నారు. ఇందులో నాలుగు టవర్లు, డేటా సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లు ఉంటాయని వివరించారు. మొత్తం 6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నామని చెప్పారు.