తెలంగాణ

మూసీ నుండి విముక్తి కలిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: మూసీ మురికి నీటి నుండి ప్రజలను రక్షించాలని ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొయినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. శాసనసభలో వివిధ డిమాండ్లపై మంగళవారం జరిగిన చర్చలో పాల్గొంటూ 2019-20 సంవత్సరంలో మూసీ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కౌసర్ విమర్శించారు. మూసీ నది ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూసీ అభివృద్ధికి వివిధ దేశాల నుండి, వివిధ సంస్థల నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ నుండి సూర్యాపేట వరకు మూసీ చుట్టుపక్కల బోర్‌వెల్స్ వేస్తే రసాయనాలతో కూడిన మురికినీరే వస్తోందని అన్నారు. మూసీ నీటిని శుద్ధి చేసి కిందకు వదలాలని, రసాయనాలు మూసీలో కలవకుండా చూడాలని కోరారు.
రేషన్‌షాప్‌లు ఏర్పాటు చేయాలి
కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ సభ్యుడు రామలింగారెడ్డి కోరారు. కొత్త గ్రామ పంచాయతీల్లో అన్ని వౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, మహిళా సంఘాలకు పంచాయతీలను యూనిట్‌గా పరిగణనించాలని సూచించారు. టీఆర్‌ఎస్ సభ్యుడు నన్నపనేని నరేందర్ తదితరులు కూడా మాట్లాడారు.