తెలంగాణ

పార్టీ మారిన సబితకు మంత్రి పదవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పౌర హక్కులను కేసీఆర్ అణచివేసిందని, నియంతృత్వ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా హత్యకు గురవుతుందో గవర్నర్‌కు తెలియచేశామన్నారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని, తమ పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందన్నారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. అనైతిక విధానాలకు కేసీఆర్ సర్కార్ పాల్పడుతోందన్నారు. గతంలో టీడీపీ నుంచి ఎన్నికైన తలసానికి కూడా కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, వారి బాధను వినేందుకు గవర్నర్ త్వరలో ప్రజా దర్బార్‌ను నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పీసీసీ కోశాధికారి గూడూరి నారాయణ రెడ్డి తెలిపారు.
*చిత్రం...రాజ్‌భవన్‌లో మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ తదితరులు