తెలంగాణ

హరీష్‌రావుతో రాజ్‌గోపాల్‌రెడ్డి మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి హరీశ్‌రావుతో మంతనాలు జరిపారు. లాబీల్లో పాలక, ప్రతిపక్ష సభ్యులు ఎదురుపడినప్పుడు కరచాలం, పలకరింపులకే పరిమితం అవుతారు. కానీ రాజ్‌గోపాల్‌రెడ్డి హరీశ్‌రావుతో సుమారు అర గంట పాటు భేటీ కావడం ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ సభ్యుల్లో చర్చనీయాంశమైంది. నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌గోపాల్‌రెడ్డి తాజాగా హరీశ్‌రావుతో మంతనాలు జరపడంతో టీఆర్‌ఎస్‌లో చేరుతారేమోనన్న అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. శాసనసభలో రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంపీగా పార్లమెంట్‌లో కూడా తాను ఎంతో పోరాడానని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనేతగా సీఎం కేసీఆర్ అంటే ఎంతో తనకు ఎంతో గౌరవం ఉందని పొగిడారు. ఈ వ్యాఖ్యలు, ఆ భేటీకి ఏదైనా లింక్ ఉందా? అనే కోణంపై కూడా లాబీల్లో చర్చ జరిగింది.