తెలంగాణ

హరితహారంలో 174.01 కోట్ల మొక్కల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో తరిగిపోయిన అడవులను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమలుచేస్తోందని అటవీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తరిగిపోయిన అడవులను పునరుజ్జీవింపచేయడంతో పాటు ఈ కార్యక్రమం కింద ఇంత వరకూ దాదాపు 174.01 కోట్ల మేరకు మొక్కలు నాటామని అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ ఆనంద్ మెతుకు, బాల్కసుమన్‌లు అడిగిన ప్రశ్నలకు మంగళవారం నాడు మంత్రి శాసనసభలో సమాధానం చెప్పారు. వీలైనంత మేరకు ట్రీగార్డులు, నీటినిపోయడం, పహరా, రక్షణ కల్పించడం ద్వారా మొక్కలను సంరక్షించడానికి ఆయా శాఖలు, ఏజన్సీలు అన్ని చర్యలనూ తీసుకుంటున్నాయని అన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బ్రతికేటట్టు చూడటానికి ప్రస్తుతం పంచాయతీ చట్టానికి అవసరమైన సవరణలు చేశామని అన్నారు. స్థానికంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారాన్ని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఐదేళ్లుగా నిర్వహిస్తున్నామని అన్నారు. కళాజాతలు, పేపర్ ప్రకటనలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రకటనలు, పోస్టర్లు, స్థానిక స్థాయిలో పరిచయ కార్యక్రమం నిర్వహించామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఆర్‌జీఎఫ్‌ఆర్ చట్టాన్ని అమలుచేస్తోందని అటవీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇంత వరకూ 94,774 వ్యక్తిగత క్లయిమ్‌లు, 721 సాముదాయక క్లయిమ్‌లు వచ్చాయని, అందులో 89956 వ్యక్తిగత క్లయిమ్‌లు అనర్హమైనవిగా గిరిజన సంక్షేమ శాఖ గుర్తించిందని పేర్కొన్నారు.
అన్ని జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్‌రోడ్లు
హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్‌రోడ్డు తరహాలో అన్ని జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్‌రోడ్లను నిర్మించాలని టీఆర్‌ఎస్ సభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు. శాసనసభలో వివిధ డిమాండ్లపై మంగళవారం జరిగిన చర్చలో పాల్గొంటూ, రింగ్‌రోడ్ల వల్ల ప్రజలకు రవాణాసదుపాయాలు మెరుగవుతాయని, వాహనాల రాకపోకలు కూడా సులువుగా జరుగుతాయన్నారు. హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అలాగే హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన అద్భుతంగా ఉందని, 125 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి మెరుగైందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలియచేస్తున్నానని అన్నారు.