తెలంగాణ

నెహ్రూ, పటేల్ కృషితోనే హైదరాబాద్ సంస్థానం విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనానికి తొలి ప్రధాని జవహర్‌లలాల్ నెహ్రూ, హోంశాఖమంత్రి సర్దార్ పటేల్ తీసుకున్న గొప్ప నిర్ణయమని, ఆ నాటి అమరులను స్మరించుకునే పవిత్రమైనరోజు సెప్టెంబర్ 17వ తేదీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ గాంధీభవన్‌లో నిర్వహించిన విలీన దినోత్సవ వేడుకల్లోమాట్లాడుతూ నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని చూశారని, కాని నెహ్రూ, పటేల్ సకాలంలో తీసుకున్న చర్యల వల్ల దేశ సమగ్రత సాధ్యమైందన్నారు. ఈ విషయాన్ని బీజేపీ వక్రీకరిస్తోందన్నారు. బీజేపీకి చరిత్ర తెలియదన్నారు. ఆంధ్రాకు చెందిన బీజేపీ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ తెలంగాణ చరిత్ర తెలియదని ఆయన విమర్శించారు. భారత్‌లో హైదరాబాద్ విలీన ఉత్సవాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహించి భావితరాలకు తెలియచేయాలన్నారు. సెప్టెంబర్ 17ను రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ చూస్తోందని ఆయన అన్నారు.
కోఠీలో తెలంగాణ పరిరక్షణ దినం
రాజధానిలోని కోఠీ బస్టాండ్ వద్ద అమరవీరుల స్మారక స్థూపం వద్ద జాతీయ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటం చరిత్రాత్మకమైనదన్నారు. ఇప్పుడు రాజకీయం చేస్తున్న వారు నిజాం వ్యతిరేక పోరాటంలో లేరన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీదేనన్నారు. హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని తెలంగాణ పరిరక్షణ దినంగా పాటిస్తూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీసీసీ సమన్వయ కర్త జీ నిరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, స్వాతంత్య్ర సమరయోధులు బాబూరావ్ వర్మ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నాటక, మహారాష్టల్రో సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా విలీన దినోత్సవంగా జరుపుతుంటే, కేసీఆర్ ఎందుకు జంకుతున్నారని మాజీ ఎంపీ వీ హనుమంతరావు ధ్వజమెత్తారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మజ్లిస్ ముప్పు పొందేందుకు కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారన్నారు. ఉద్యమ సమయంలో అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వెనక్కుతగ్గారన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ చరిత్రను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ నేత మల్లు రవి మాట్లాడుతూ కేసీఆర్ చరిత్రను విస్మరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.