తెలంగాణ

ఉర్దూ టీచర్ పోస్టులన్నీ భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 2012, 2017 డిఎస్సీ రిక్రూట్‌మెంట్‌లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వుడ్ కేటగిరిల్లో అభ్యర్ధులు లేకపోవడంతో అనేక ఉర్దూ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, మొహ్మద్ మోజాంఖాన్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ పాషా ఖాద్రీ, కౌసర్ మొహియుద్దీన్‌లు అడిగిన ప్రశ్నలకు మంగళవారం నాడు శాసనసభలో మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఎన్నడూ హామీ ఇవ్వలైదని అన్నారు. గత ప్రభుత్వాలు ఈ పదవులను భర్తీ చేయడానికి పూర్వపు డిఎస్సీలో వీటిని ఓపెన్ క్యాటగిరికి డీ రిజర్వు చేసిన మాట నిజమేనని అయితే ప్రభుత్వ ఉత్తర్వులను ట్రిబ్యునల్, హైకోర్టులు కొట్టివేశాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ కేటగిరిల్లో భర్తీ చేయని ఉర్దూ ఉపాధ్యాయ పదవుల సంఖ్య హైదరాబాద్ టీఎస్‌పీఎస్‌సీ నుండి అందిన తర్వాత రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నియమావళి 22 క్లాజు ప్రకారం అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.
తల్లులు పిల్లలకు పౌష్టికాహారం
రాష్ట్రంలో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నట్టు మహిళా, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఈ పథకాన్ని జనవరిలో ప్రారంభించామని, ఏడాదిలో 300 రోజుల పాటు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 200 ఎంఎల్ పాలను, నెలకు అదనంగా 14 గుడ్లను సమకూర్చడానికి ఏడు నెలల నుండి మూడేళ్ల వయస్సున్న పిల్లలకు నెలకు అదనంగా 8 గుడ్లను, మూడేళ్ల నుండి ఆరేళ్ల వయస్సున్న పిల్లలకు అదనంగా 14 గుడ్లను సమకూర్చడానికి అయ్యే వ్యయాన్ని భరించడానికి కేంద్ర నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందజేస్తోందని పేర్కొన్నారు. ప్రతి లబ్దిదారుడికి రోజుకు 21 రూపాయిలు వ్యయంతో అన్నం, పప్పు, కూర, ఉడకబెట్టిన గుడ్డు, 200 ఎంఎల్ పాలతో పూర్తి భోజనం ఉంటుందని అన్నారు. ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్‌ను గర్భదారణ సమయంలో ఇస్తున్నామని, బరువును పర్యవేక్షించడానికి కూడా ఏడబ్ల్యుసీలలో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి నెలా దాదాపు 17 లక్షల మంది మహిళలు, పిల్లలు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఆరోగ్యలక్ష్మి , అనుబంధ పౌష్టికాహార కార్యక్రమం కింద 650 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

*చిత్రం... సబితా ఇంద్రారెడ్డి