తెలంగాణ

ప్రతి నియోజకవర్గానికీ 30 వేల సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల చొప్పున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని, పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్టం చేయాలని ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ గాంధీభవన్‌లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నేతలు జనంలోకి వెళ్లాలని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియచేయాలన్నారు. గతంలో 20 లక్షల సభ్యత్వం ఉందన్నారు. సభ్యత్వ రుసుము ఐదు రూపాయలన్నారు. పార్టీ నేతలు స్వచ్చందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హుజూర్‌నగర్ ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల విషయం కోర్టులో ఉందని, తేలిన తర్వాత తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామాన్నరు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా గాంధీ భవన్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 10వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో , 15న అన్ని నియోజక కేంద్రాల్లో గాంధీ జయంతి ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.
యురేనియం అఖిలపక్షంపై వివాదం
యురేనియం తవ్వకాలపై ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, తవ్వకాలపై పోరాటాలుచేయాలని నిర్ణయిస్తే, జనసేన నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి పార్టీ నేతలు హాజరు కావడంపై సమావేశంలో కొంత మంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉద్యమిస్తోందని, కమిటీని కూడా నిర్మించిందని కొంత మంది సభ్యులు ప్రస్తావించారు. జనసేన ఈ అంశంపై అఖిల పక్ష కమిటీ నిర్వహిస్తే మన సీనియర్ నేతలు హాజరు కావడం తగదని కొంత మంది సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్‌సీ కుంతియా హామీ ఇచ్చినట్లు తెలిసింది.