తెలంగాణ

బీజేపీ సభ్యత్వం స్వీకరించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు సోమవారం బీజీపీలో ప్రాధమిక సభ్యత్వాన్ని స్వీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ సమక్షంలో ఆయన సభ్వత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సహా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించి తెలంగాణ బిడ్డగా గవర్నర్ బాధ్యతకు ఆయన వనె్న తెచ్చి భారత గౌరవాన్ని నిలిపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమిళనాడులో సంక్షోభ సమయంలో తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారని, ఏకకాలంలో రెండు రాష్ట్రాల గవర్నర్‌గా సమయోచితంగా వ్యవహరించారని అన్నారు. ఏబీవీపీ నేతగా, ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి నేతగా సమర్ధంగా మొక్కవోని ధైర్యంతో వ్యవహరించారని అన్నారు.
*చిత్రం...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు