తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో పాండవులదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాండవులదే విజయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పాండవులదే విజయమని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. సమయం బాగా లేనప్పుడు పాండవులు అరణ్యవాసం చేశారన్నారు. కాంగ్రెస్‌లో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు కూడా ఉన్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో, భట్టిని ప్రతిపక్ష హోదా నుంచి తొలగించినప్పుడూ అంత బాధపడ్డానని రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.