తెలంగాణ

ప్రభుత్వంపై వీఆర్‌ఏల తిరుగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: రెవెన్యూ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, ఈ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రెవెన్యూ అసిస్టెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ధర్నాలు చేపడుతోంది. అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ఎన్. గోవిందు, రాష్ట్ర అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షులు సాలోమెన్ తదితరుల పేరుతో సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ అయింది. రాష్ట్రంలోని అన్ని మండ ల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఏ రూపంలో కూడా రెవెన్యూ వ్యవస్థకు విఘాతం కలగనివ్వవద్దని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కమినర్‌కు కూడా ఈ సందర్భంగా వినతిపత్రం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లా విఆర్‌ఏలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టిందని, ఎక్కడాలేని విధంగా అవినీతి తాండవిస్తోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం పట్ల గోవిందు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. భూములకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభంచిన ‘్ధరణి’ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు జరుగుతున్నాయన్నారు. ఈ లోపాలను సరిచేయకుండా రెవెన్యూ సిబ్బందిని విమర్శించడం సమంజసం కాదన్నారు. రెవెన్యూ వ్యవస్థను రద్దుచేస్తే ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని హెచ్చరించారు. గత పాలకులకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను కాపాడుకునేందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.