తెలంగాణ

ఓజోన్ పొరను రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: భూమి చుట్టూ ఉన్న ‘ఓజోన్ పొర’ను రక్షించుకుందామని రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఒక ప్రకటన చేస్తూ, భూమిని అతినీల లోహిత కిరణాల నుండి రక్షించే ఓజోన్ కవచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలోని అన్ని దేశాలపై, ప్రజలందరిపై ఉందన్నారు. మనం వాడే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కాస్మిటిక్స్, టాయిలెట్లకు వాడే రసాయనాలు కూడా ఓజోన్ పొర దెబ్బతినేందుకు కారణమన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రకృతి సంపదను కాపాడుతూనే జల, వాయు, భూ కాలుష్యాన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. హరితహారం పథకం కింద రాష్ట్రంలో 270 కోట్ల మొక్కలను నాటుతున్నామన్నారు. సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్తు ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. పర్యావరణానికి హాని కలగని విధంగా గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయి జీవించాలని కోరారు.