తెలంగాణ

మృతదేహాల కోసం ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 16: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట శివారు కడిపికొండలో విషాద వాతావరణం నెలకొంది. విహార యాత్ర విషాద యాత్రగా మారి పడవ మునకతో 9 మంది గల్లంతు కాగా అందులో సోమవారం ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. వారిలో బస్కే అవినాష్, బస్కే రాజేందర్ మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. సోమవారం రాత్రికి మృతదేహాలు ప్రత్యేక అంబులెన్స్‌లో ఇక్కడికి చేరుకున్నాయి. మితీతా మృతదేహాల కోసం వారి బంధువులు అక్కడే ఎదురుచూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన ఘోర పడవ ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 9 మంది గల్లంతు అయిన నేపథ్యంలో సంఘటనా స్థలానికి వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు అక్కడికి చేరుకున్నారు. అక్కడి ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి సంఘటనా స్థలంలో వివరాలను అడిగి తెలుసుకొని వరంగల్ జిల్లాకు చెందిన మృతదేహాలను, వారి బంధువులకు అప్పగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అప్పటికే కడిపికొండకు చెందిన స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు నర్మెట వెంకటరమణ గౌడ్ ఆధ్వర్యంలో కొంతమంది పట్టణ పెద్దలు కూడా అక్కడికి చేరుకున్నారు. విహార యాత్రకు వెళ్లిన 14 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే బతికి బయటపడ్డారు. పడవలో ఉన్న అందరూముందుగా జాకెట్ వేసుకోలేదు. అయితే పడవ ఒకేసారి మునిగే పరిస్థితి రావడంతో అప్పటికప్పుడే కొందరు జాకెట్ మీద వేసుకొని గోదావరిలో దూకారు. అదృష్టవశాత్తు అ పక్కనే గిరిజన తండా ఉండడం, అప్పటికే ఆ గిరిజన తండావాసులు పడవ మునకను గమనిస్తుండడంతో అప్రమత్తం అయి నాటు పడవలతో అక్కడికి హుటాహుటిన చేరుకొని కొంతమందిని రక్షించగలిగారు. అలా రక్షించిన వారిలో కడిపికొండకు చెందిన ఐదుగురు ఉన్నారు. ఇక మిగిలిన వారు జాకెట్ వేసుకోకపోవడం వల్లే గోదావరిలో మునిగి ఉంటారని చెప్తున్నారు. పట్టణం అంతా విషాద వాతావరణంతో ఉంది.

*చిత్రాలు.. పడవ ప్రమాదంలో మృతిచెందిన బస్కే రాజేందరెడ్డి, అవినాష్ మృతదేహాలు,
*రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం జగన్‌తో కలిసి పరామర్శిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ఆరూరి