తెలంగాణ

శ్రీశైలానికి తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబర్ 16: జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని వదులుతున్న వరద గేట్లను సోమవారం ఉదయం మూశారు. సోమవారం సాయంత్రం సమయానికి జూరాల విద్యుత్ కేంద్రం ద్వారా 22,082 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం నుంచి 17,916 క్యూసెక్కులు, మొత్తం 39,916 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వస్తున్నది. ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,013 క్యూసెక్కులు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా 40,259 క్యూసెక్కులు, కేఎల్‌ఐ ద్వారా 3200 క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువ ద్వారా 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 20వేల క్యూసెక్కులు మొత్తం 95,498 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటలలో కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 14.815 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రంలో 19.898 మిలియన్ యూనిట్లు మొత్తం 34.713 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు అందించారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను 884.20 అడుగులుగా, గరిష్ట నీటి నిలువ 215 టీఎంసీలకుగాను 210.9946 టీఎంసీలు నమోదైంది.

*చిత్రం... నిండుకుండలా కనిపిస్తున్న శ్రీశైలం రిజర్వాయర్