తెలంగాణ

కమ్యూనిస్టుల సాయుధ పోరాటంతోనే .. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన నాటి నిజాం నవాబు, రజాకార్లకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సాయుధ పోరాట ఫలితంగానే హైద్రాబాద్ సంస్థానం భారత్ యూనియన్‌లో విలీనమైందని, ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా చేపట్టిన బస్ జాత సోమవారం నగరానికి చేరుకుంది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించగా, తెలంగాణ ప్రాంతంలోని హైద్రాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం రాలేదన్నారు. నాడు ఈ ప్రాంతంలో జాతీయ జెండా ఎగరేసిన వారిని నైజాం పాలకులు చిత్రహింసలకు గురిచేసేవారని, ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, వెట్టిచాకిరీ చేయించుకుని, దొంగ అప్పు పత్రాలు సృష్టించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. వారి ఆగడాలను ఎదిరిస్తూ, అడ్డుకునేందుకు 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, ముగ్ధుం మొయినొద్దీన్ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, ఆ పోరాటం 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగిందని, దాని ఫలితంగానే నిజాం నవాబు తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాడని, అయితే నేటికీ కేంద్ర పాలకులు మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతుండటం శోచనీయమన్నారు. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే విలీనం జరిగినట్లు, తప్పుడు సంకేతాలు ప్రజలకు చేరవేస్తున్నారని ఆరోపించారు. వీటిని తిప్పికొడుతూ, ఈ మహాత్తర పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళులర్పించేందుకే బస్సు జాత నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నాటి అమరుల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, వారి పోరాట చరిత్రను నేటి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన మార్కెట్ రోడ్‌లో గల అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి, నగరంలోని బైపాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన బద్ధం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శులు కొయ్యడ సృజన్‌కుమార్, కూన శోభారాణి, మారుపాక అనిల్‌కుమార్, ఎన్.జ్యోతి, కె.శ్రీనివాస్,పల్లె నర్సింహ, లక్ష్మినారాయణ, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, ఎన్.రాజు, బూడిద సదాశివతో పాటు పలువురు పాల్గొన్నారు.

*చిత్రాలు.. బద్ధం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి