తెలంగాణ

నేడు తెలంగాణ విమోచన దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అలాగే సాయంత్రం 3 గంటలకు పటన్‌చెరులో బహిరంగ సభ నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 9.45 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో, సాయంత్రం జరిగే బహిరంగ సభల్లో కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, తెలంగాణ విమోచన కమిటీ
చైర్మన్ ఎన్ శ్రీవర్దన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినాన్ని తెలంగాణ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించనున్నట్టు టీపీసీసీ సమన్వయకర్త జి నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం కోఠి బస్టాండ్ సమీపంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద జరిగే కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్వాతంత్ర సమరయోధులు బాబూరావ్ వర్మ, పార్టీ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, మాజీ మంత్రి మర్రి శశీదర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.