తెలంగాణ

కొమ్మను కూడా తాకనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (ఖైరతాబాద్): యురేనియం తవ్వకాల కోసం నల్లమలలోని కొమ్మను కూడా తాకనివ్వబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గుచేటని అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. గత 10 రోజులుగా చాలామంది నాయకులు, సినిమాలు లేని నటులు సేవ్ నల్లమల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉండి అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు పిలవని సమావేశాలకు వెళ్లి నల్లమల విషయంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరితహారం పేరుతో తెలంగాణను పచ్చదనంతో నింపాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారని అన్నారు. యురేనియం తవ్వకాలు వద్దంటూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం చేసినా ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయడం విచారకరమని అన్నారు. పచ్చని అడవుల్లో తవ్వకాలు చేపట్టేందుకు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అడవులపై ఆధారపడి జీవించే ప్రజల స్థితిగతులు తెలియని నాయకులు హైదరాబాద్‌లో స్టార్ హోటళ్లలో సమావేశాలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గిరిజనులు, ఆదివాసీల పట్ల ఏం ప్రేమ ఉందని ఇప్పడు మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఓటుకు నోటుకు అడ్డంగా దొరికవారు నల్లమలను రక్షించుకుందామని గళమెత్తుతున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. గిరిజన జీవితాలపై స్టార్ హోటళ్లలో చర్చించడం కాదు అచ్చంపేట అడ్డా మీద చర్చించాలని డిమాండ్ చేశారు. నల్లమలపై ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి హితవు పలికారు.
టూరిజం స్పాట్‌గా సంగారెడ్డి చెరువు:
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి
భారీ విస్తీర్ణంతో ఉన్న సంగారెడ్డి చెరువును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి పరచాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ పరిశ్రమలు కలిగిన సంగారెడ్డి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. టూరిజానికి పూర్తి అనుకూలమైన ప్రాంతం సంగారెడ్డి చెరువని అన్నారు. రూ.250 కోట్లతో దీనిని అభివృద్ధి పరచడం ద్వారా స్థానిక ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందని అన్నారు. కేవలం ఐదు కోట్లతో తుది దశకు చేరుకున్న శిల్పారామం పనులను పూర్తి అవుతాయని అన్నారు. మంజీరా, సింగూరు జలశయాల్లో నీటి లభ్యత లేనందున గోదావరి నీటిని సంగారెడ్డి ప్రజలకు సరఫరా చేసే చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు రెండు వేల మంది చదువుతున్న తార డిగ్రీ కాలేజీని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తే అక్కడి విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
తక్షణమే మెడికల్ కాలేజీ వచ్చేలా చూడాలని, గతంలో సిద్దాపూర్‌లో ఐదు వేల మంది పేదలకు, కొండాపూర్‌లో మూడు వేల మందికి ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్నారని, వెంటనే లబ్ధిదారులకు అందించాలని కోరారు.