తెలంగాణ

లాటరీ ద్వారా డబుల్ బెడ్‌రూమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్‌ల ఎంపిక లాటరీల ద్వారా లబ్ధిదారులకు కేటాయిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల డబుల్ బెడ్ రూమ్‌లను లబ్ధిదారులకు అప్పగించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ పథకం కోసం హడ్కో నుంచి రూ. 4 వేల కోట్లను సమీకరించడానికి ప్రభుత్వం సన్నాహాలను వేగవంతం చేస్తోందన్నారు. డబుల్ బెడ్ రూమ్‌ల ఎంపికలో ఎంపీ, ఏమ్మెల్యేల ప్రమేయం ఉండదని, ఎలాంటి పైరవీలకు అవకాశం ఉండదని ఆయన శాసన సభలో ప్రకటించారు. సోమవారం శాసనసభ సమావేశాల సందర్భంగా డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణాలు, వాటి కేటాయింపులపై సమాచారం తెలియజేయాలని పలువురు ఎమ్మెల్యేలు మంత్రికి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్‌లపై అనుమానాలు, అపోహలు ఉన్నాయన్నారు. పేదలకు కేటాయించే డబుల్ బెడ్‌రూమ్‌ల ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చివరిగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తిరిగి ఆయా గ్రామాలకు నివేదికను పంపిస్తారన్నారు. గ్రామంలో 100 మందిని లబ్ధిదారులను గుర్తించిన తర్వాత అక్కడ 50 మందికి కేటాయించాల్సి వస్తే లాటరీ ద్వారా ఎంపిక పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామసభలో కనీసం 50 శాతం ఎస్సీలకు డబుల్ బెడ్‌రూమ్‌లను కేటాయిస్తామన్నారు. పట్టణాలలో
సైతం 50 శాతం ఎస్సీలకు ఇళ్లను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లో 12 శాతం ముస్లింలకు కేటాయిస్తామని చెప్పారు.
సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ ఆవిర్భావం ముందు ఎస్సీ వర్గాలకు బడ్జెట్‌లో నామమాత్రం కేటాయింపులు ఉండేవని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీలకు నిధులు భారీగా విడుదల చేస్తున్నారన్నారు. ఎస్సీ రెసిడెన్సీ కాలేజీల్లో మెరుగైన చదువులతో పాటు భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉన్నత చదువులు చదువు కోసం విదేశాలకు పంపడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
గిరిజనుల ఆత్మబంధువు కేసీఆర్
తెలంగాణ గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మబంధువని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ గిరిజన తండాలను పంచాయతీలుగా తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత ఉద్యను అభ్యసించడానికి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, అందుకు కేంద్రాన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 19 బీసీ గురుకులాలు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 261 గురుకులాలను తీసుకువచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గురుకులాలు తీసుకురావడంతో బీసీ విద్యార్థుల ఉన్నత చదువుకు అవకాశం ఉంటుందన్నారు.

*చిత్రం... గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి