తెలంగాణ

సమాజాభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: అన్నీ ప్రభుత్వమే చేయలేదని, సమాజాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల సేవా సంగమం ముగింపు కార్యక్రమంలో కిషన్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారకులు శ్యామ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజల వౌలిక సదుపాయాల కల్పనలో బీజేపీ ఉద్యమంలా పని చేస్తుందన్నారు. ఒన్ టైమ్ ప్లాస్టిక్ నినాదంతో రానున్న రోజుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా తొలగిస్తామన్నారు. స్వచ్భంద సంస్థలు సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే సంస్థలపై ఫిర్యాదు చేయాలన్నారు. తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్లనే కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగులేదన్నారు. జన్‌సంఘ్ ఏర్పాటుకు కారణం కూడా ఆర్టికల్ 370యేనని ఆయన అన్నారు.
సామాజిక సంస్థలు నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ, 1990లో సేవా భారతి ఏర్పాటు అయిందని, జాతి పునర్ నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. నిరుపేదల కష్టాలను దూరం చేయడానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, తోటివారి కోసం ఏమి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సమాజమంతా ఒక్కటేనన్న భావన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సేవను పొందిన వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వాగత సమితి ప్రతినిధులు ఎంవీ రామరాజు, రామమూర్తి, డాక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.

*చిత్రం... సేవా భారతి ఆధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల సేవా సంగమం ముగింపు
కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి