తెలంగాణ

జీయర్ ట్రస్టుకు భూకేటాయింపులపై న్యాయపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 14: యాదాద్రిలో ప్రభుత్వం పేదవాళ్ల వద్ద ప్రజాధనంతో కొనుగోలు చేసిన భూములను త్రిదండి చినజీయర్ ట్రస్టుకు కేటాయించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసమని భూసేకరణ చేసి తాను సేకరించిన ధర కంటే తక్కువగా సదరు భూములను వేరొక ట్రస్టుకు అప్పగించడం భూసేకరణ లక్ష్యాలకు, చట్టాలకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామన్నారు. లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం తనకు ఎంతో ప్రీతికరమన్నారు. స్వామివారు తమ కుటుంబ ఆరాధ్యదైవమన్నారు. ఆలయ అభివృద్ధి సంతోషదాయకమని, అయితే ఆలయాల నిర్మాణ పనుల్లో ప్రభుత్వం రాజకీయాలు చొప్పించడాన్ని ఆయన ఖండించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, శ్రీనివాస్‌నేత, న్యాయవాది స్వామి తదితరులు ఉన్నారు.
*చిత్రం... యాదాద్రిలో విలేఖరులతో మాట్లాడుతున్న దామోదర రాజనరసింహ